ఇంటర్ విద్యార్దుల ఆత్మహత్యల పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం

232
supreme Court
- Advertisement -

తెలంగాణా ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.   విచారణ చేపట్టిన అనంతరం ఈ పిటిషన్ ను కొట్టేసినట్లు ప్రకటించింది. కొద్దిరోజుల క్రీతమే హైకోర్టులో ఈఅంశం పై పిటిషన్ ను కొట్టేసినట్లు గుర్తు చేసింది సుప్రీం.

ఇందులో ప్రభుత్వం ప్రమేయం ఏమి లేదని స్పష్టం చేసింది. కాగా కొద్ది రోజుల క్రితం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్దులు 21మంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పలువురు సుప్రీం, హైకోర్టు ఆశ్రయించారు.

ఇంటర్ ఫలితాల సందర్భంగా గందరగోళం చెలరేగడం.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై కూలంకష విచారణ అవసరమనీ, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఉన్నత విద్యా విభాగంమాజీ డైరెక్టర్‌ వెలిచాల కొండల్‌రావు వ్యాజ్యం దాఖలు చేశారు.

 

- Advertisement -