బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీం సీరియస్‌..

4
- Advertisement -

జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు కోల్‌కతాను కుదిపేస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోల్ కతా వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వీరికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా డాకర్టులు సైతం ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును సుమోటోగో స్వీకరించింది సుప్రీం కోర్టు.

ఇక ఇవాళ విచారణ సందర్భంగా బెంగాల్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రైనీ డాక్ట‌ర్ శ‌రీరాన్ని ఆమె పేరెంట్స్‌కు అప్ప‌గించ‌డంలో ఎందుకు జాప్యం చేశార‌ని బెంగాల్ స‌ర్కార్‌ను కోర్టు ప్ర‌శ్నించింది. ఈ కేసును విచారించ‌డంలోనూ బెంగాల్ పోలీసులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు కోర్టు చెప్పింది.

అలాగే శాంతియుతంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న‌వారిపై అధికారాన్ని వాడ‌రాదు అని తేల్చిచెప్పింది న్యాయస్థానం. నిర‌స‌న‌కారులపై దాడి చేయ‌డం స‌రికాదు అని… మేం జోక్యం చేసుకోబోయే అంశాల గురించి వెల్ల‌డిస్తున్నామ‌ని, శాంతియుతంగా నిర‌స‌న చేప‌డుతున్న‌వారిపై బెంగాల్ స‌ర్కార్ ప‌వ‌ర్‌ను వాడ‌రాదు అని సీజేఐ డీవై చంద్ర‌చూడ్ తెలిపారు.

ట్రైనీ డాక్ట‌ర్ అత్యాచారం, హ‌త్య కేసును బెంగాల్ ప్ర‌భుత్వం స‌రైన రీతిలో నియంత్రించ‌లేక‌పోయింద‌ని, ఆస్ప‌త్రిలో జ‌రిగిన విధ్వంసాన్ని ఎందుకు అడ్డుకోలేక‌పోయింద‌ని కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Also Read:Rahul Gandhi:మీరే నా స్పూర్తి..రాజీవ్‌కు ఘన నివాళులు

- Advertisement -