నిర్భయ దోషుల శిక్ష..తదుపరి విచారణ జనవరి 7కి వాయిదా

386
Supreme Court
- Advertisement -

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ హత్యాచారం కేసులో దోషి అక్షయ్‌ సింగ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.ఈ కేసులో దోషి అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ తనకు విధించిన మరణ శిక్షపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.తీర్పుపై సమీక్ష కోరే హక్కు దోషికి ఉండబోదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దోషులకు ఉరిశిక్ష సరైనదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ ఆర్.భానుమతి, అశోక్ భూషణ్, బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇరు వర్గాల వాదనలు విని ఈ తీర్పును ఈ రోజు మధ్యాహ్నం 1.00 గంటలకు ప్రకటించింది.

సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కొట్టివేసిన అంశంపై దోషులకు తాజాగా నోటీస్ ఇవ్వాలని తీహార్ జైలు అధికారులకు పటియాల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు డెత్ వారెంట్ పై నిర్ణయం తీసుకోలేమని పటియాల హౌస్ కోర్టు వెలువరించింది. తదుపరి విచారణను జనవరి 7కి వాయిదా వేసింది. నిర్భయ కేసులో దోషులకు శిక్ష అమలులో జాప్యం చేయడంతో కోర్టును ఆశ్రయించారు నిర్భయ తల్లితండ్రులు. న్యాయపరమైన అవకాశాలు అన్ని పూర్తయిన తర్వాతే డెత్ వారెంట్ ఇవ్వాని కోర్టను కోరారు దోషుల తరపు న్యాయవాదులు.

- Advertisement -