కరోనా పరీక్షలు…హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

173
supreme court
- Advertisement -

ఆస్పత్రుల్లో మరణించిన వారికీ  కరోనా పరీక్షలు చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది.కరోనా పరీక్షల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది.

హైకోర్టు ఆదేశించినట్లు అందరికీ కరోనా పరీక్షలు సాధ్యపడవని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ నిబంధనల మేరకే కరోనా పరీక్షలు చేస్తున్నామని వాదనలు వినిపించింది.

తెలంగాణ ప్రభుత్వ వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

- Advertisement -