- Advertisement -
సుప్రీం కోర్టులో కాంగ్రెస్ ఎంపీ,ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఊరట లభించింది. రాహుల్‌పై దాఖలైన పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నవారు బాధ్యతగా మాట్లాడాలని చురకలంటించింది.
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయగా రాహుల్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తీర్పు వెలువరించింది సుప్రీం.
ఇక రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం కేసులో కేంద్రానికి ఊరట లభించింది. రఫేల్ సమీక్ష పిటిషన్లన్నింటిని కోర్టు తిరస్కరించింది. రఫేల్‌పై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.
- Advertisement -