కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ ఇవ్వడంపై కర్ణాటక హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభిమాని రేణుక స్వామి హత్య కేసులో అరెస్టయిన దర్శన్, పవిత్ర గౌడ మరికొందరికి అక్టోబర్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది కర్ణాటక హైకోర్టు.
కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేసింది కర్ణాటక ప్రభుత్వం. హైకోర్టు చేసిన తప్పునే తాము పునరావృతం చేయబోమని ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు.
Also Read:నీట్ విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు
ట్రయల్ కోర్టు ఇలాంటి తప్పిదాలు చేసిందంటే పరిగణలోకి తీసుకోవచ్చు.. కానీ హైకోర్టు జడ్జి ఇలాంటి తీర్పు ఇవ్వడం ఆమోదయోగ్యమైంది కాదని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వీళ్ళు దోషులా లేదా నిర్దోషులా అనేది మేము ఇప్పుడే తీర్పు ఇవ్వమని పవిత్ర గౌడ తరపు లాయర్‌కు సృష్టం చేసింది సుప్రీంకోర్టు.

