Supreme:పతంజలిపై సుప్రీం కీలకవ్యాఖ్యలు

18
- Advertisement -

పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్, బాలకృష్ణలపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. పతంజలి ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని దాఖలైన పిటిషన్‌పై మండిపడింది సుప్రీం. పతంజలి తరపున ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించగా గతంలో పతంజలి ఉత్పత్తులపై పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిన సైజ్ లోనే క్షమాపణ ప్రకటన కూడా ఉందా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.

రూ. 10 లక్షలు ఖర్చుపెట్టి 67 వార్తాపత్రికల్లో క్షమాపణ ప్రకటనలు ఇచ్చాం అని రోహిత్గి చెప్పగా మీ క్షమాపణను ప్రముఖంగా ప్రచురించారా? గతంలో మీరిచ్చిన ప్రకటనల తరహాలోనే అంతే పెద్ద అక్షరాలు, పెద్ద సైజులో క్షమాపణ ఉందా? అని ప్రశ్నించారు జస్టిస్ హిమా కోహ్లీ .క్షమాపణ చెప్పేందుకు కంపెనీ రూ. లక్షల్లో ఖర్చుపెట్టిందని ముకుల్ రోహత్గీ గుర్తుచేయగా అది కోర్టుకు అవసరం లేదని తెలిపారు న్యాయమూర్తి. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు వారంపాటు వాయిదా వేసింది.

ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో అన్ని జాతీయ వార్తాపత్రికల్లో మంగళవారం పతంజలి ఆయుర్వేద సంస్థ క్షమాపణ ప్రకటన ఇచ్చింది.

Also Read:రచయితగా మారిన అల్లరి నరేష్..

- Advertisement -