టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార సోషల్ మీడియాలో చాలా పాపులర్. మహేష్.. నమ్రత ఇద్దరూ సితారకు సంబంధించిన ఏదో ఒక విశేషం షేర్ చేస్తూ ఉంటారు. ఇక సితార ఈ మధ్య ‘ఫ్రోజెన్ 2’ సినిమాలో బేబీ ఎల్సా పాత్రకు గాత్రం అందించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మూవీ ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. డిస్నీ స్టూడియో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఇక తన కుమార్తె గొంతును తొలిసారిగా వెండితెరపై వినేందుకు ఆగలేకుండా ఉన్నానని మహేశ్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. “ఆమె నిజంగా క్వీన్ ఎల్సాకు మినీ వర్షన్. ఎంతో నమ్మకంగా, మ్యాజికల్‌గా, స్వచ్ఛంగా ఉంది. సీతూ పాపను చూస్తుంటే గర్వంగా ఉంది. నవంబర్ 22 వరకూ ఆగలేను” అని ట్వీట్ చేశారు. కాగా మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది.
She is truly a mini version of Queen Elsa! Confident, Magical and Pure. So proud of you Situ papa! ❤❤ Can't wait for 22nd November #Frozen2 in Telugu…@DisneyStudiosIN pic.twitter.com/aN6uu4s0EG
— Mahesh Babu (@urstrulyMahesh) November 20, 2019
She is truly a mini version of Queen Elsa! Confident, Magical and Pure. So proud of you Situ papa! Can’t wait for 22nd November Frozen 2 in Telugu..