- Advertisement -
ఏ ఎం బి సినిమాస్‌కి ప్రేక్షకుల నుండి జి ఎస్ టి రూపంలో అదనంగా వచ్చిన రూ 35.66 లక్షలను వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించిన సూపర్ స్టార్ మహేష్ బాబును జి ఎస్ టి హైదరాబాద్ కమిషనరేట్ ప్రశంసించింది. ఏ ఎం బి సినిమాస్ యజమానులైన మహేష్ బాబు, సునీల్ నారంగ్‌లు తమది కాని లాభాన్ని గుర్తించి తిరిగి చెల్లించినందుకు అభినందిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఎవరూ ఇలా బాధ్యతగా జీ ఎస్ టీని వెనక్కు తిరిగి ఇవ్వలేదని… మహేష్ బాబు, సునీల్‌లు అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, లోని థియేటర్ల యజమానులపై ఈ నిర్ణయం సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది. సూపర్ స్టార్ ఏ విషయంలోనైనా సూపర్ స్టారే అని మరోసారి ఋజువైంది.
- Advertisement -