మహేష్ మాస్ డాన్స్ ..ఊచకోతే!

34
- Advertisement -

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాస్, క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ఇలా అన్నీ వర్గాల్లో భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. యాక్టింగ్, ఫైట్స్.. లలో మహేష్ బాబుకు తిరుగు లేదు. ఒక డ్యాన్స్ విషయంలో మాత్రం మహేష్ ఇతర హీరోల కంటే కొంత వెనుకంజలో ఉన్నాడనే చెప్పాలి. దాంతో మహేష్ అభిమానులు ఎప్పటి నుంచో తమ హీరో ఫుల్ మాస్ బిట్స్ కు డ్యాన్స్ చేస్తే చూడాలని కోరుకుంటున్నారు. గతంలో నేనొక్కడినే సినిమాలో కొంత డ్యాన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన మూవీ ఫ్లాప్ కావడంతో మహేష్ డ్యాన్స్ కు పెద్దగా హైప్ రాలేదు. ఇక ఆ మధ్య సరిలేరు నీకెవ్వరు మూవీలో మైండ్ బ్లాక్ పాటకు పక్కా మాస్ బిట్స్ తో అభిమానులను అలరించాడు. దీంతో మహేష్ మాస్ డ్యాన్స్ మరోసారి చూడాలని అభిమానులు కోరుకుంటూ వచ్చారు. .

ఇక మహేష్ తాజా చిత్రం ‘ ‘గుంటూరు కారం’ మూవీ తో అభిమానుల కోరిక తీర్చే పనిలో ఉన్నాడు. పక్కా మాస్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో మహేష్ డ్యాన్స్ ఇరగదీసినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ‘కుర్చీ మడతబెట్టి..’ సాంగ్ లో శ్రీలీల తో కలిసి ఊర మాస్ స్టెప్స్ తో చెలరేగినట్లు తెలుస్తోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందిన ఈ పాట బి, సి సెంటర్స్ లో బెంచ్ మార్క్ ను క్రియేట్ చేయడం ఖాయమని చెబుతున్నారు అభిమానులు. ఇక ఈ పాటతో పాటు మరో మాస్ బీట్ కూడా మూవీలో ఉన్నట్లు సమాచారం. మరి చాలా రోజుల తర్వాత మాస్ డాన్స్ తో అభిమానులకు ఫుల్ జోష్ ఇస్తున్న మహేష్.. ఇక మూవీ విడుదల అయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

Also Read:కాళేశ్వరంపై కాంగ్రెస్..ఎందుకిలా?

- Advertisement -