‘2.ఓ’ అక్షయ్ కుమార్ మేకింగ్ వీడియో..

256
2.0
- Advertisement -

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన మూవీ 2.ఓ. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈసినిమా డిసెంబ‌ర్ 29న విడుద‌ల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ తో ప్రేక్ష‌కులను ఆశ్చ‌ర్య‌పరుస్తుంది. ట్రైలర్ ఇప్పటికే దాదాపు 15కోట్ల వ్యూస్ వ‌ర‌కూ చేర‌కుంది. రీసెంట్ ఈమూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈమూవీకి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు.

2.0 rajinikanth

తాజాగా ఈమూవీలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ విల‌న్ పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. క్రౌమ్యాన్‌గా, వివిధ గెటప్స్‌లో, చిత్ర విచిత్రమైన మేకప్‌తో అక్షయ్ కనిపించాడు. త‌న సినిమా కెరీర్ లో 2.ఓ క‌ష్ట‌ప‌డినంత‌గా మ‌రే సినిమాకు క‌ష్ట‌ప‌డ‌లేద‌ని చెప్పారు. అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించగా, లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై, సుభాస్కరన్, రూ.550 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు.

- Advertisement -