కృష్టగారి అబ్బాయనే నేను అంటూ ‘భరత్ అనే నేను’ భహిరంగ సభలో తన ప్రసంగాన్నిస్టార్ట్ చేశాడు మహేష్ బాబు. ఈ క్రమంలోనే ‘తెలుగు సిని ఉండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు ఐదారుగులు మాత్రమే.. మేమూ మేమూ బాగానే ఉంటాం..కానీ మీరే ఇంకా బాగుండాలి’ అంటూ ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడాడు సూపర్ స్టార్ మహేష్.
ఎల్బీస్టేడియంలోమహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు.
ఇక్కడ ఇంత మంది జనాల్ని చూస్తుంటే..ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకుండా.. వందరోజుల ఫంక్షన్ కు వచ్చినట్టుందని చెప్పుకొచ్చాడు మహేష్. ఎన్టీఆర్ మూవీ ‘ఆది’ ఆడియో ఫంక్షన్ కి తాను వెళ్ళానని, ఇప్పుడు ‘భరత్ అనే నేనే’ సినిమాకి ఎన్టీఆర్ రావడం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. కాగా .. ఇకనుంచి ట్రెండ్ మారుతుందని, ప్రతీ ఫంక్షన్‌కి అందరు హీరో వెళ్తారని అన్నారు.
కాగా కొరటాల గురించి మాట్లాడుతూ..ఈసినిమాలో తాను సీఎంగా కనిపించనున్నాని డైరెక్టర్ చెప్పినప్పుడు భయమేసిందని, రాజకీయాలకు దూరంగా ఉండే తాను సడన్ గా సీఎంగా కనిపించడమేంటనే వణుకు వచ్చిందన్నారు. కానీ కథ చెప్పుడు ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పుకొచ్చారు.
కాగా..ఏప్రిల్ 20న మహేష్ అమ్మగారు ఇందిర పుట్టిన రోజని, ఈ సినిమా ఆ రోజున రిలీజ్ అవడం చాలా సంతాషంగా ఉందని అన్నారు.