“మహర్షి” ట్వీట్టర్ రివ్వూ..

249
Mahesh-babu

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మహర్షి. మహేశ్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ.. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఈమూవీ ధియేటర్లలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుఝామునే బెనిఫిట్ షోలు వేశారు. అన్ని ఏరియాల నుంచి మహర్షి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. మహేష్ బాబు మూడు విభిన్నమైన పాత్రల్లో అదరగొట్టాడని, వంశీ పైడిపల్లి సినిమా మొదటి భాగం వినోదాత్మకంగా, రెండో భాగం ఎమోషనల్‌గా రూపొందించినట్లు చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ‘మహర్షి’ కథ అద్భుతంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రిమియర్ షో లు చూసిన ప్రేక్షకులు అద్భుతంగా ఉంది..బ్లాక్ బాస్టర్ హిట్ అని చెబుతున్నారు. ‘మహర్షి’ చిత్రంపై ప్రేక్షకుల స్పందనలు ఎలా ఉన్నాయో ట్వీట్స్ ద్వారా తెలుసుకుందాం.

మహర్షి సినిమా కథలో ఇన్వాల్వ్ అయ్యేలా ప్రేక్షకుడ్ని కట్టి పడేసింది. ఎమోషనల్‌గా సాగిన క్లైమాక్స్ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లింది. పదరా పదరా సాంగ్ అదిరిపోయింది. గొడ్ల బండి ఫైట్ సూపర్బ్ ఉంది అంటూ పవన్ కళ్యాణ్‌ అభిమాని ట్వీట్ చేశారు.

https://twitter.com/lifeforpawan/status/1126246036610019328

మహర్షి ఫస్టాఫ్ యూత్ అండ్ క్లాస్ ఆడియన్స్ ఆడియన్స్ కోసం..సెకండాఫ్ మాస్ ఆడియన్స్‌కి.. ఓవరాల్‌గా ‘మహర్షి’ ఎమోషనల్ జర్నీ ఫుల్ మీల్స్ బ్లాక్ బస్టర్ అని ట్వీట్ చేశారు. తెనాలి లక్ష్మీ టాకిస్ యాజమాన్యం..

మహేష్ బాబు నుంచి మరొక మంచి సినిమా వచ్చింది. మహేష్ బాబు అదరగొట్టాడు. వంశీ పైడిపల్లి సినిమాలోని క్యారెక్టర్లు డిజైన్ చేసిన విధానం బావుంది. అల్లరి నరేష్, పూజా హెగ్డే ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్, రావు రమేష్ సూపర్బర్. డిఎస్సీ సంగీతం బావుంది అని ట్వీట్ చేశారు. మొత్తం మీద ట్వీట్టర్ రివ్వూ చూస్తుంటే మహేశ్ ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్ హిట్ పడిందని చెప్పుకోవాలి.