స‌ర్కార్ పై స్పందించిన సూప‌ర్ స్టార్..

240
mahesh babu..
- Advertisement -

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఏ.ఆర్ మురుగ‌దాస్ తెర‌కెక్కించిన మూవీ స‌ర్కార్. ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా, కీర్తి సురేష్ హీరొయిన్ గా న‌టించిన విష‌యం తెలిసిందే. విడుద‌లైన మొద‌టి రోజు నుంచి బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. రెండురోజుల్లోనే 100కోట్ల రూపాయ‌ల మార్క్ ను దాటేసింది. ఏ.ఆర్ రెహ‌మాన్ ఈచిత్రానికి సంగీతం అందించారు. ఇక ఓవర్‌సీస్‌లోనూ హాలీవుడ్‌ సినిమా రేంజ్‌లో దూసుకెళ్తోంది.

sarkar movie

ఈసినిమాపై పలువురు ప్ర‌ముఖులు ప్ర‌శంసలు కురిపిస్తున్నారు. తాజాగా స‌ర్కార్ చిత్రంపై సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. సినిమాలో మురుగదాస్‌ మార్క్‌ స్పష్టంగా కనిపించిందిన ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమాను చాలా బాగా ఎంజాయ్‌ చేశాన‌ని చెప్పారు. చిత్ర‌బృందానికి శుభాకాంక్షాలు తెలిపారు మ‌హేశ్. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో స్పైడ‌ర్ చిత్రం వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

- Advertisement -