ఘనంగా సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు వేడుకలు..

683
- Advertisement -

తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన నటుడు సూపర్‌స్టార్ కృష్ణ నేడు 80వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. జన్మదిన వేడుకలు మే 31న హైదరాబాద్‌ లోని తన స్వగృహంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుండి వచ్చిన ఘట్టమనేని కృష్ణ, మహేష్‌ అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో తన అభిమానుల మధ్య సూపర్‌స్టార్‌కృష్ణ కేక్‌ కట్‌ చేశారు.

సూపర్‌ స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ – నా ప్రతి సంవత్సరం పుట్టిన రోజున నాకు జన్మనిచ్చిన తల్లి తండ్రులతో పాటు నాకు సినీ జన్మనిచ్చిన ‘తేనెమనసులు’ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారిని, ‘గూఢచారి 116’ నిర్మాత ధూండి గారిని తలుచుకుంటాను. మీ అందరి అభిమానంతోనే 350 సినిమాల్లో నటించగలిగాను, మీ అభిమానమే మాకు శ్రీరామ రక్ష. ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజును అభిమానుల మధ్య జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నారు.

- Advertisement -