అద్భుతం..ఆవిష్కృతమైంది

228
Super Blue Blood Moon
- Advertisement -

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. త్రిపాత్రాభినయంతో పండు వెన్నెలను పంచే చంద్రుడు అత్యంత అరుదైన రూపంలో దర్శనమిచ్చాడు. సూపర్‌ మూన్‌, బ్లూ మూన్‌, బ్లడ్‌ మూన్‌లతో కనిపించాడు. భ్రమణ సమయంలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సంభవించే పౌర్ణమిని సూపర్‌ మూన్‌ గా పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు సాధారణ పౌర్ణమి కంటే కాస్త పెద్దగా కనిపిస్తాడు.

మరోవైపు ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని బ్లూ మూన్‌గా పిలుస్తారు. చంద్రగ్రహణంనాడు ఒక్కోసారి భూమి వాతావరణం గుండా చంద్రుడిపై సూర్యకిరణాలు పడతాయి. దీంతో చంద్రుడు గోధుమ వర్ణంలో కనిపిస్తాడు. ఈ పరిణామాన్ని బ్లడ్‌ మూన్‌గా చెబుతారు. బ్లూ, బ్లడ్‌, సూపర్‌ మూన్‌లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే ఈ మూడు కలిసి రావడం అత్యంత అరుదు.

ఈ పరిణామాన్ని స్పష్టంగా వీక్షించే అవకాశం ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా వాసులకు దక్కింది.ఇలాంటి అత్యంత అరుదైన దృశ్యం చివరిగా 1982లో చోటుచేసుకుంది. దీన్ని వీక్షించే అవకాశం నేటి తర్వాత మళ్లీ 2037 వరకూ ఉండబోదు.

- Advertisement -