ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ పవన్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల ఆయన ప్రారంభించిన వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ చేస్తున్న వ్యాఖ్యలన్నీ ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నిన్న కాకినాడ లో జనసేన పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ” నాకు ప్రాణహాని ఉందని, ప్రత్యేకంగా తనను అంతమొందించడానికి సుఫరీ గ్యాంగ్ లను దింపారనే సమాచారం ఉందంటూ ఒక్కసారిగా బాంబ్ పేల్చారు. ప్రస్తుతం వైసీపీ నేతలకు ఓటమి భయం పొంచి ఉందని, అధికారం చేజారిపోతుందనే భయంతో వారు ఎంతకైనా తెగిస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్. .
ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో అగ్గి రాజేస్తున్నాయి. గతంలో కూడా పవన్ కు ప్రాణహాని ఉందంటూ పలు కథనాలు వెలువడ్డాయి.. పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే నిజంగానే పవన్ కు ప్రాణహాని ఉండే అవకాశం ఉందా ? లేదా కేవలం పోలిటికల్ మైలేజ్ కోసమే ఈ అంశాన్ని పవన్ లేవనెత్తుతున్నారా ? అనే సందేహాలను కొందరు రాజకీయ వాదులు లేవనెత్తుతున్నారు.
Also Read:దూకుడు పెంచిన బిఆర్‌ఎస్..?
ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ క్రియాశీలకంగా మారింది. పవన్ తన పదునైన వ్యాఖ్యలతో పార్టీకి మరింత వైలేజ్ తెస్తున్నారు. గతంతో పోల్చితే జనసేన బలం గట్టిగానే పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో జనసేనానిపై ఎలాంటి ఘాతుకానికి పాల్పడిన.. అందరి చూపు వైసీపీ పార్టీపైన, జగన్ పనే ఉంటుంది. అందువల్ల పవన్ కు ప్రాణహాని తలపెట్టే పని వైసీపీ చేయదనేది కొందరు చెబుతున్నా మాట. ఇక పోతే పదే పదే పవన్ ఆ మాటను ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు అనే విషయానికొస్తే.. ప్రజల్లో సింపతీ సంపాదించుకునేందుకే పవన్ ప్రాణహాని అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయింది.
Also Read:Adipurush:రెండోరోజు వసూళ్లివే