సన్ రైజర్స్ హైదరబాద్ వరుసగా మూడో మ్యాచ్ లో కూడా ఓటమిపాలయ్యింది. నిన్న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో 39పరుగుల తేడాతో హైదరబాద్ ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణిత 20ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 155పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ లో ఓపెనర్స్ పృధ్వీ 4పరుగులు చేయగా శిఖర్ ధావన్ 7పరుగులకే అవుట్ అయ్యారు.
ఆ తర్వాత గ్రీస్ లోకి వచ్చిన మన్రో 40పరుగులు చేసి అవుట్ కాగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 45పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక రిషబ్ పంత్ 23 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 14పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లు భువనేశ్వర్ 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు, అభిషేక్‌శర్మ, రషీద్‌ఖాన్ తలో వికెట్ తమ ఖాతాల్లో వేసుకున్నారు.
ఇక 157పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఓపెనర్లు ఇద్దరు మంచి స్కోర్ ను సాధించారు. డేవిడ్ వార్నర్ 51పరుగులు చేయగా, బెయిర్ స్టో 41పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్ రబాడ 4వికెట్లు, క్రీస్ మోరిస్ 3 వికెట్లు, కీమో పాల్ 3 వికెట్లు తీసి ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు.