సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి గెలుపు..

94
CSK vs SRH
- Advertisement -

ఐపీఎల్ భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు ఖాతా తెరిచింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన పోరులో ప్రణాళికాబద్ధంగా ఆడి టోర్నీలో తొలి గెలుపును రుచిచూసింది హైదరాబాద్‌. 155 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సన్ రైజర్స్ జట్టు విజయలక్ష్యాన్ని కేవలం 17.4 ఓవర్లలోనే అందుకోవడం విశేషం. చెన్నై బౌలర్లలో ముఖేశ్ చౌదరి 1, బ్రావో 1 వికెట్ తీశారు. ఈ విజయంతో సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో కాస్త పైకి ఎగబాకగా, చెన్నై జట్టు ఆడిన 4 మ్యాచ్ ల్లో 4 ఓటములతో మరింత దిగజారింది.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ సమయోచితంగా విజృంభించి 50 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. అభిషేక్ స్కోరులో 5 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. మరో ఎండ్ లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాధ్యతాయుతంగా ఆడి 32 పరుగులు చేసి, అభిషేక్ శర్మకు సరైన సహకారం అందించాడు. రాహుల్ త్రిపాఠి 15 బంతుల్లో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. త్రిపాఠి 5 ఫోర్లు, 2 సిక్సులు సంధించాడు.

- Advertisement -