మధురరాజా.. సన్నీ -మమ్ముట్టి..ఫోటో వైరల్!

309
Sunny-Mammootty
- Advertisement -

పోర్న్ ఇండస్ట్రీ నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టిన సన్నీ లియోన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నారు. సన్నీ లియోన్ ఐటం సాంగ్ ఉండే ఆ సినిమాకు మంచి క్రేజ్ వస్తుండటంతో ఆమెతో ప్రత్యేక గీతం చేయించడానికి ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్న ‘మధుర రాజా’ అనే సినిమా ద్వారా సన్నీ లియోన్ మలయాళం ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఈ చిత్రంలో ఆమె ఐటం సాంగులో నటిస్తోందని, ప్రత్యేకంగా వేసిన సెట్లో చిత్రీకరణ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

అయితే ఈ సెట్లో తీసిన సన్నీ-మమ్ముట్టి ఫోటో వైరల్ గా మారింది.  షూటింగ్ సమయంలో వీరిద్దరు కలిసి తీసిన ఫోటోను షేర్ చేశాడు నటుడు అజు వర్గీస్. ఈ ఫోటోకి, అక్క విత్ ఇక్క అనే హెడ్డింగ్ పెట్టి పోస్ట్ చేశాడు. అక్క, ఇక్క అంటే బ్రదర్, సిస్టర్ అని అర్థం. దీంతో మహిళలందరూ తీవ్రస్థాయిలో కామెంట్స్ చెయ్యడం స్టార్ట్ చేశారు. వారికి మమ్ముట్టి ఫ్యాన్స్ కూడా యాడ్ అయ్యేసరికి, అజు వర్గీస్ తను పోస్ట్ చేసిన ఫోటోని డిలీట్ చేసేశాడు.

అంతేగాదు నెటిజన్లు ఫన్నీట్రోల్స్‌తో సోషల్‌ మీడియాలో ఈ ఫోటో వైరల్‌గా మారింది. 2010లో మమ్ముట్టి, పృథ్వీరాజ్ నటించిన సూపర్ హిట్ సినిమా పోక్కిరిరాజాకి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. జగపతి బాబు కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో చేస్తున్నాడని సమాచారం.

- Advertisement -