సన్నీలియోన్ ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఇప్పుడు ఆ రంగాన్ని పూర్తిగా వదులుకుని.. ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉంచింది. బాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్ల కన్నా కూడా సన్నీ బెటర్ అన్న పేరును సంపాదించుకోగలిగింది. ఉత్తరాది భామల్లో చాలా మంది దక్షిణాది వైపు చూడడానికి కూడా ఇష్టపడకపోతే సన్నీ మాత్రం తనకు భాషా బేధం లేదంటూ చేతల్లో నిరూపించుకుంది. గత మూడుసంవత్సరాల కాలంలో రెండుసార్లు తెలుగులో మెరిసింది సన్నీ.ఆమె ‘కరెంట్ తీగ’ తరువాత ఇంతవరకు టాలీవుడ్ లో మరో సినిమా చేయలేదు.తాజాగా ఓ ఇంటర్వ్య లో తెలుగు సినిమాల్లో నిటించలేకపోవడానికి గల కారణాన్ని వెల్లడించింది.
‘కరెంట్ తీగ’ తరువాత చాలామంది దక్షిణాది దర్శకనిర్మాతలు నన్ను కలిశారు. కొన్ని సినిమాలకు డేట్లు అడ్జస్ట్ కాలేదు. మరికొన్ని నచ్చలేదు. దాంతో ఇంత గ్యాప్ తీసుకోవలసి వచ్చింది. దక్షిణాది వారి సినీ నిర్మాణం నాకు బాగా నచ్చుతుంది. ఇక్కడ పనిచేయడం సౌకర్యంగా ఉంటుంది కూడా! ముఖ్యంగా తెలుగు సినిమాల్లో చేయడం ఈజీ! ఇక్కడి వారు డేట్లు అదనంగా అడగరు. చెప్పిన సమయానికి షూటింగ్ మొదలుపెడతారు. ఫినిష్ చేస్తారు. ఉత్తరాదితో పోల్చుకుంటే ఇక్కడ సినిమాలు చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది.డేట్లు అడ్జస్ట్ అయితే తెలుగులో కూడా కచ్చితంగా నటిస్తానని తెలిపింది.