సన్నీ కోసం తెగవెతికారు…

238
Sunny Leone is Google's most searched
- Advertisement -

మాజీ పోర్న్‌ స్టార్‌.. బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌కు  ఉన్న ఫాలోయింగ్‌ అంతాఇంతాకాదు. గూగుల్‌ సెర్చింగ్‌లో వరసుగా ఆరో సంవత్సరం సన్నీ లియోన్‌ టాప్ స్ధానంలో నిలిచింది.   సన్నీకి సంబంధించిన హాట్‌హాట్‌ ఫొటోలు, ఆమె గురించిన వివరాల కోసం చాలామంది గూగుల్‌లో సెర్చ్‌ చేసినట్లు తెలిసింది. సన్నీ తర్వాత స్ధానంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్షి ఖాన్‌,సప్న చౌదరి,విద్య వాక్స్‌,దిశా పటానీ ఉన్నారు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినీ చరిత్రలో ఓ సంచలనం. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలుకొట్టి కొత్త రికార్డులను లిఖించింది. ఎన్నో అవార్డులు అందుకుంది. తాజాగా ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌లోనూ టాప్‌ ట్రెండిగ్‌ సెర్చ్‌ క్వెరీగా నిలిచింది. ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది శోధించింది ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్‌’ గురించేనట. ఇక సినిమా విషయానికి వస్తే బాహుబలి-2 ది కన్‌క్లూజన్‌ మూవీ ట్రెండింగ్‌లో నిలవగా ఈ సినిమా దర్శకుడు రాజమౌళి గురించి ఎక్కువమంది సెర్చ్ చేశారు.

 Sunny Leone is Google's most searched
ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే  ఐపీఎల్‌,లైవ్ క్రికెట్  స్కోర్‌ కోసం ఎక్కువమంది వెతికగా టాప్‌ ట్రెండింగ్ 3లో నిలిచింది. పాలిటిక్స్ విషయానికి వస్తే మోడీ సర్కార్ తీసుకొచ్చిన నోట్ల రద్దు,జీఎస్టీ గురించి ఎక్కువ మంది సెర్చ్ చేయగా మరికొంతమంది  టాప్ న్యూస్,సీబీఎస్‌ఈ ఫలితాలు,యూపీ ఎన్నికల గురించి సెర్చ్‌ చేశారు.

ఇంట‌ర్నెట్ యుగంలో ప్ర‌తి ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికే ప్ర‌దేశం గూగుల్‌. ఎక్కువ మంది ఆశ్ర‌యించేది కూడా ఈ సెర్చింజ‌న్‌నే. అందులో భాగంగా ఈ ఏడాది ట్రెండ్ అయిన ప్ర‌శ్న‌ల‌ను గూగుల్ వెల్ల‌డించింది.   ఆధార్ కార్డ్‌తో పాన్ కార్డ్ ఎలా లింక్ చేయాలి?.. జియో ఫోన్ ఎలా బుక్ చేయాలి.?.. జీఎస్టీ రిట‌ర్న్ ఎలా ఫైల్ చేయాలి?… మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? వాటి గురించి వెతికారట.

- Advertisement -