సన్నీ..డాక్యుమెంటరీ వస్తోంది

521
- Advertisement -

పోర్న్‌స్టార్‌ నుండి ఫిలింస్టార్‌ గా మారిన బ్యూటీ సన్నీలియోన్‌. ఈ సెక్స్ బాంబ్ సన్నీలియోన్ ఏం చేసినా సెక్సీగా ఉంటుంది. అందుకే ఈ శృంగార తారకి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. యువత గుండెల్లో శృంగార దేవతగా చోటు సంపాదించుకున్న సన్నీ అందాలను క్యాష్ చేసుకునేందుకు దర్శక-నిర్మాతలు ప్రయత్నిస్తూంటారు.ఇంతవరకు సన్నీ నటించిన సినిమాల్లో కథ లేకుండానే మొత్తం ఆరబోతతోనే కథల్ని తెరకెక్కించారంటే అది సన్నీ క్రేజ్.

సన్నీ లియోన్ జీవితకథ ఆధారంగా డాక్యుమెంటరీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘కరంజిత్’ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ పూర్తయింది. జీ టీవీ గ్రూప్ నిర్మించిన ఈ చిత్రంలో సన్నీ లియోన్ జీవిత ప్రస్థానం మొత్తం ఆవిష్కృతమవుతుంది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Sunny Leone documentary soon

2011లో వివాదస్పద బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా బాలీవుడ్‌కు సన్నీలియోని పరిచయమైంది. ఆ తర్వాత జిస్మ్- 2, జాక్‌పాట్, ఏక్ పహేలీ లీలా చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. తర్వాత పలు బాలీవుడ్, టాలీవుడ్‌ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లో హాట్ హాట్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేసింది.

తెలుగులో కరెంట్‌తీగ, రాజశేఖర్ నటించిన గరుడవేగ మూవీలో ‘డియో.. డియో’ అంటూ ఐటమ్ బాంబ్ పేల్చిన సన్నీ.. పూర్తిస్థాయి తెలుగు సినిమాతో ముందుకురాబోతుంది. వీరనారిగా కత్తి తిప్పేందుకు ‘వీర మహాదేవి’ రెడీ అవుతోంది. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, మలయాళం,హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

- Advertisement -