హైదరాబాద్‌లో సన్నీలియోన్ డ్యాన్స్

224
sunny-leone
- Advertisement -

సన్నీలియోన్.. ఒకప్పుడు పోర్న్ స్టార్.. ఆ తర్వాత బాలీవుడ్‌లో పెద్ద స్టార్.. ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమెకున్న క్రేజ్ దేశం మొత్తానికి తెలిసిపోయింది. ఇప్పుడు సన్నీ హైదరాబాద్ రాబోతోంది. అంతే కాదు డ్యాన్స్ చేసి మెప్పించనుంది. రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న గరుడ వేగ సినిమాలో ఐటెం సాంగ్ చేసి అలరిస్తున్న ఈ అమ్మడు హైదరాబాదీల మతి పోగొట్టేందుకు సిద్ధమవుతోంది. గరుడ వేగ ఆడియో రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఈ నెల 27న జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ ఈవెంట్‌కి సన్నీ హాజరై ఓ సాంగ్‌కి పెర్ఫార్మ్ చేయనుందని టాక్.ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అమ్మడు చిందులు వేయబోతోందట. కాని అక్కడే ఒక సమస్య వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

sunny-leone
ఈ కార్యక్రమంలో నాట్యం చేయడానికి అమ్మడు ఎక్స్ర్ ట్రా పైకం కావాలంటూ డిమాండ్ చేస్తోందట. లైవ్ లో అలా డ్యాన్స్ చేయాలంటే సాధారణంగా కోట్లలో పుచ్చుకునే సన్నీ.. ఇప్పుడు ఇలా ఫ్రీగా చేయనంటూ మొండికేస్తోందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మొన్నా మధ్య  సన్నీలియోన్ కేరళలోని కొచ్చిలో ఓ షోరూం ఓపెనింగ్‌కు వెళితేనే, పుట్టలకెల్లి వచ్చిన సీమలెక్కనే  జనాలతోని, రోడ్లు మొత్తం ట్రాఫిక్ జాం అయిపోయినయ్. నంద్యాల ఎలక్షన్ లో కూడా  కొందరు రాజకీయనాయకులు, కేరళ ‘సన్నీ’ జనాన్ని తమ పబ్లిసిటీకి బాగానే వాడుకున్నరు.  మరి హైద్రాబాద్‌లో సన్నీ లైవ్‌గా డ్యాన్స్ చేస్తుంది అంటే పరిస్థితి ఎలా ఉండబోతుందో ఏమో మరి.

- Advertisement -