సన్నీ యాడ్‌ కోసం 15 మంది పోలీసులు…!

203
- Advertisement -

బాలీవుడ్ భామ సన్నీలియోన్‌ చేసే ప్రకటనలపై వ్యతిరేకతలు రావడం కామన్‌ అయిపోయింది. తాజాగా మరోసారి సన్నీకి చెందిన ఒక ప్రకటనపై దుమారం చెలరేగింది. దసరా నవరాత్రుల సందర్భంగా చేసే గర్భా నృత్యాలతో ముడిపెట్టి ఈ ప్రకటనను రూపొందించడమే ఈ వివాదానికి కారణంగా నిలిచింది.

ఈ ప్రకటనను చూసిన జనం ఆందోళన చేస్తారనే ఉద్దేశంతో 15 మంది పోలీసులు దానికి రక్షణ కవచంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే గుజరాత్‌ లోని సూరత్‌లో ఒక కండోమ్ బ్రాండ్ ఇటీవల ఒక పెద్ద హోర్డింగ్‌ను ఏర్పాటుచేసింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. నవరాత్రులు సమీపిస్తున్న సందర్భంలో ఏర్పాటుచేసిన ఈ ప్రకటన చూసిన జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sunny Leone Condom Ad Controversy

సన్నీలియోన్ ఉన్న ఈ ప్రకటన ప్రజల మనోభావాలు దెబ్బతీసేదిగా ఉందని వారు ఆరోపించారు. దీనిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. గుజరాత్‌లో దసరా నవరాత్రి ఉత్పవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి.

తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గర్భా నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దీనిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపధ్యంలో ఈ వివాదాస్పద ప్రకటనను సంబంధిత కంపెనీ తొలగించింది.

- Advertisement -