సన్ని సపోర్టుగా నిలిచింది..

225
Sunny Leone Comes Out in Support of Priyanka Chopra
- Advertisement -

ప్ర‌ముఖ పోర్న్‌స్టార్ రేంజ్ నుంచి బాలీవుడ్ స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయింది స‌న్నిలియోన్‌. బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో స‌రిస‌మానమైన క్రేజ్‌తో దూసుకుపోతోన్న స‌న్నిలియోన్ ఇప్పుడు వ‌రుస‌గా సినిమాలు, ఐటెం సాంగ్‌లు, లైవ్ పెర్పామెన్స్‌ల‌తో చాలా బిజీబిజీగా ఉంటోంది .అయితే డేరింగ్ గా మాట్లాడేయడంలో ఈ మధ్య సన్నిలియోన్ ఆరితేరిపోయింది. ఆ మధ్య ఓ టీవీ ఛానల్ కు పోర్న్ సినిమాలు చేసినందుకు తానేమీ ఫీలవడం లేదంటూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన దగ్గర నుంచి అమ్మడి టాకింగ్ స్టైల్ పూర్తిగా కొత్తగా ఉంది. గతంలో తన విషయాలకు మాత్రమే పరిమితం అయ్యే ఈ భామ మాటలు.. ఇప్పుడు ఇతర వివాదాల్లోకి కూడా చేరుతున్నాయి.

Sunny Leone Comes Out in Support of Priyanka Chopra

ప్రస్తుతం ప్రధాని మోడీ ఎదురుగుండా.. మోకాళ్ల పైవరకు డ్రెసింగ్ తో ప్రియాంక చోప్రా కూర్చోవడం అనే విషయం దేశవ్యాప్తంగా హాట్ న్యూస్ గా నడుస్తూనే ఉంది. దీనిపై ఇప్పటికే ప్రియాంక చాచిపెట్టి కొట్టినట్లు సమాధానం ఇవ్వగా.. ఇప్పుడు సన్నీలియోన్ నుంచి ప్రియాంక చోప్రాకు సపోర్ట్ లభించింది. ‘నాకు తెలిసి మనం వెరీ స్మార్ట్ మ్యాన్ ను ప్రధానిగా ఎంచుకున్నాం. ఆయన ఎంతో తెలివైన వారు.. ఏ విషయమైనా పైకి చెప్పేయగలరు. ఆ డ్రెస్ తో ఏదైనా సమస్య ఉంటే.. ఆయన ప్రియాంకకే చెప్పేవారు కదా. కానీ ఆయన అలా చేయలేదు’ అంటోంది సన్నీ లియోన్.

మరి సన్ని ప్రియంకాకు మద్దతుగా.. ‘ప్రియాంకా చోప్రాకు సమాజానికి ఏది ఎలా తిరిగివ్వాలనే విషయం బాగా తెలుసు. ఎవరితో ఎలా మసలుకోవాలో కూడా తెలుసు. ఆమెను తన చర్యలతో జడ్జ్ చేయాలి తప్ప.. ధరించే దుస్తులతోనే కాదు’ అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఈ వివాదంలో తల దూర్చేందుకు అంగీకరించని బిగ్ బీ లాంటి బడా వ్యక్తి ‘నేను ప్రధానినీ కాదు.. ప్రియాంకనూ కాదు’ అంటే.. సన్నీ మాత్రం స్ట్రెయిట్ గా స్టేట్మెంట్ ఇచ్చేయడం విశేషం.

- Advertisement -