సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. ఏపీలో శాసనసభతో పాటు ఎంపీ స్ధానాలకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో విచిత్రం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా భద్రచాలం నుండి సీపీఎం తరపున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సున్నం రాజయ్య ఈ సారి ఏపీ నుండి పోటీచేయనున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం రాజయ్య ప్రాతినిధ్యం వహించిన భద్రాచలంలోని మెజార్టీ మండలాలు పోలవరం ముంపు గ్రామల్లో భాగంగా ఏపీలో కలిశాయి. దీంతో ఈ సారి ఆయన రంపచోడవరం నుండి బరిలో దిగుతున్నారు.
2014 ఎన్నికల్లో రంపచోడవరంలో వైసీపీ అభ్యర్ధి వంతల రాజేశ్వరి ఘన విజయం సాధించారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె వైసీపీని టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీ తరఫున వంతల రాజేశ్వరి, వైసీపీ తరఫున నాగులపల్లి ధనలక్ష్మి బరిలో ఉండగా జనసేన మద్దతుతతో సీపీఎం నుండి సున్నం రాజయ్య బరిలో నిలిచారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం దే తనను గెలిపిస్తుందన్న ధీమాలో సున్నం రాజయ్య ఉండగా రెండోసారి గెలుపు కోసం రాజేశ్వరి,వైసీపీ నుంచి టికెట్ దక్కించుకున్న ధనలక్ష్మి విజయబావుటా ఎగురవేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.