9 నెలల తర్వాత భూమిపైకి సునీతా విలియమ్స్

1
- Advertisement -

దాదాపు 9 నెలల తర్వాత భూమిపైకి రానున్నారు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్. మార్చి 17 (సోమవారం) రాత్రి 10.45 గంటలకు (భారత కాలమానం ప్రకారం మార్చి 18న ఉదయం 8.30గంటల ప్రాంతంలో) క్రూ డ్రాగన్ వ్యోమనౌక హాచ్ మూసివేత ప్రక్రియ సమయం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్ క్రూ-9 భూమికి తిరిగి రావడాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తామని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.

క్రూ-10 మిషన్ లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. వారికి సునీతా, బుచ్ విల్మోర్ లు ఘనస్వాగతం పలికారు. అయితే, సునీతా విలియమ్స్, విల్మోర్ లు భూమిపైకి రానున్నారు. ఈ విషయంపై నాసా తాజాగా కీలక ప్రకటన చేసింది.

అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం మార్చి 19వ తేదీ తెల్లవారుజామున 3.27గంటలకు) ప్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది.

Also Read:తెలంగాణ జాతి పిత కేసీఆరే: కౌశిక్ రెడ్డి

 

- Advertisement -