NASA:సునీతా విలియమ్స్ రిటైర్మెంట్

3
- Advertisement -

భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (60) తన సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి వీడ్కోలు పలికారు. నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం గత ఏడాది డిసెంబర్ 25 నుంచే అమల్లోకి వచ్చిందని నాసా వెల్లడించింది.

మానవ అంతరిక్ష ప్రయాణంలో సునీతా విలియమ్స్ ఒక మార్గదర్శకురాలని, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఆమె చూపిన నాయకత్వం, సాంకేతిక నైపుణ్యం భవిష్యత్తులో చంద్రుడు, మార్స్ మిషన్లకు బలమైన పునాది వేసిందని నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మన్ ప్రశంసించారు.

1998లో నాసాకు ఎంపికైన సునీతా, 27 ఏళ్ల పాటు సేవలందించారు. మొత్తం మూడు మిషన్లలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, 608 రోజులు స్పేస్‌లో గడిపారు. అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన అమెరికన్ల జాబితాలో ఆమె ఆరో స్థానంలో నిలిచారు. బుచ్ విల్‌మోర్‌తో కలిసి 286 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. మొత్తం తొమ్మిది స్పేస్ వాక్‌లు చేసి, 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్‌లో గడిపిన మహిళగా రికార్డు సృష్టించారు. అంతరిక్షంలోనే మారథాన్ పూర్తి చేసిన తొలి వ్యక్తిగా కూడా ఆమె చరిత్రలో నిలిచారు.

Also  Read:‘నారీ నారీ నడుమ మురారి’..ఆనందాన్ని ఇచ్చింది

సునీతా విలియమ్స్ ప్రయాణం కోట్లాది యువతకు ప్రేరణగా నిలుస్తుందని నాసా పేర్కొంది.

- Advertisement -