న‌వ్వించే ఉంగరాల రాంబాబు..

116
sunils-ungarala-rambabu-movie
sunils-ungarala-rambabu-movie

క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ లు త‌న సొంతం చేసుకొన్న‌ సునీల్ హీరోగా, మంచి చిత్రాల ద‌ర్శ‌కుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపోందుతున్న‌ చిత్రం ఉంగరాల రాంబాబు. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలువ‌ల‌తో కూడిన వాణిజ్య‌ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి మే నెల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. అతిత్వ‌ర‌లోనే జిబ్రాన్ అందించిన ఆడియో విడుద‌ల చేస్తారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ” మా దర్శకుడు క్రాంతి మాధవ్ తెర‌కెక్కిస్తున్న ఉంగ‌రాల రాంబాబు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సునిల్ న‌టించిన అందాల‌రాముడు త‌ర‌హ న‌వ్వించే చిత్రంగా తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పోందుతుంది. ఈ సంవ‌త్స‌రం స‌మ్మ‌ర్ లో ఫ్యామిలి ఆడియ‌న్స్ ని క‌డుపుబ్బ న‌వ్వించే మెట్ట‌మెద‌టి చిత్రంగా మా ఉంగ‌రాల రాంబాబు వుంటాడనేది మా న‌మ్మ‌కం. త్వ‌ర‌లో మేము విడుద‌ల చేస్తున్న విజువ‌ల్స్ చూస్తే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ని ఏ రేంజిలో తెర‌కెక్కించామ‌నేది తెలుస్తుంది. మా చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. న‌వ్వించ‌డమే ద్యేయంగా అది కూడా అవుటాఫ్ కామెడి కాకుండా క‌థ‌లోని కామెడి ని పోందు ప‌ర‌చి న‌వ్విస్తాము. ప్ర‌కాష్‌రాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిషోర్ ల కాంబినేష‌న్ లో సునిల్ చేసిన కామెడి అంతాఇంతాకాదు. ఈ స‌మ్మ‌ర్ కి పెర్‌ఫెక్ట్ కామెడి మూవీగా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పోందుతుంద‌నే న‌మ్మ‌కం మా యూనిట్ అంద‌రికి వుంది. అతిత్వ‌ర‌లో జిబ్రాన్ అందించిన ఆడియోని విడుద‌ల చేస్తాము. ఫుల్ లెంగ్తె కామెడి మాత్ర‌మే చేశాము. ఈ స‌మ్మ‌ర్ లో ఫుల్ కామెడి చిత్రం గా మే నెల‌లో ఉంగరాల రాంబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం. ” అని అన్నారు.

నటీ నటులు – సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున, తదితరులు