శివరాత్రికి “ఉంగరాల రాంబాబు” ఫస్ట్ లుక్….

245
- Advertisement -

ఇటీవలే ‘జ‌క్క‌న్న’ తొ క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ ని త‌న సొంతం చేసుకొని సూప‌ర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని… మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్న‌ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు. రథ సప్తమి సందర్బంగా ఈ చిత్ర ప్రచార రథాన్ని ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. మహా శివరాత్రి సందర్భంగా హీరో సునీల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
sunil’s ungarala rambabu first look on Mahashivaratri
ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ అన్ని చిత్రాల కంటే హై స్టాండ‌ర్డ్ లో వుంటుంది. సునిల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు… నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి సెకండ్ వీక్ లో ఆడియో రిలీజ్ చేసి వేసవి కానుకగా సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
sunil’s ungarala rambabu first look on Mahashivaratri
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ” మా దర్శకులు క్రాంతి మాధవ్ తెర‌కెక్కించిన రెండు చిత్రాలు హృదయాల‌కి హ‌త్తుకునేలా వుంటాయి. ఆయ‌న మార్క్ వుంటూనే, సునిల్ త‌ర‌హా కామెడి చేస్తూ ఓ చక్కని కమర్షియిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఉంగరాల రాంబాబు చిత్రం ద్వారా అందించబోతున్నారు. సునీల్ పెర్ ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో త‌న  క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉండనుంది. మహా శివరాత్రి సందర్భంగా హీరో సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాం. ఈ ఫస్ట్ లుక్ తో సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. ఇటీవలే సునీల్ పై ఎనర్జిటిక్ సాంగ్ చిత్రీకరించాం. మార్చి రెండో వారంలో చిత్ర ఆడియోను విడుదల చేసి…. సమ్మర్ కానుకగా ఉంగరాల రాంబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం. ” అని అన్నారు.

- Advertisement -