“కొత్త బంగారు లోకం” మొదలుకొని ‘ప్రేమమ్’ వరకు పదుల సంఖ్యలో సినిమాలు చేసి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రవీణ్- ఇకపై ‘తత్కాల్ ప్రవీణ్’గా పాపులరవ్వడం ఖాయమని గోల్డెన్ స్టార్ సునీల్ అంటున్నారు.
‘జయమ్ము నిశ్చయమ్మురా’లో ప్రవీణ్ పోషించిన ‘తత్కాల్’ పాత్ర ఫస్ట్ లుక్ హీరో సునీల్ విడుదల చేశారు. మున్సిపల్ ఆఫీస్‌లో మీడియేటర్‌గా పనిచేస్తూ ‘మీ పనే.. నా మని’ అనే ఊతపదంతో ప్రవీణ్ పోషించిన ‘తత్కాల్’ పాత్ర ప్రవీణ్‌కు మంచి పేరు తీసుకురావాలని.. ‘తత్కాల్’ అతని ఇంటిపేరుగా మారిపోవాలని సునీల్ అభిలషించారు.
చక్కని టైమింగ్‌తో ‘తత్కాల్’ పాత్ర ద్వారా ప్రవీణ్ సినిమా మొత్తం కడుపుబ్బ నవ్విస్తాడని పేర్కొన్న దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి` తత్కాల్ ఫస్ట్‌లుక్ విడుదల చేసిన హీరో సునీల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
చిత్ర కథానాయకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో ప్రవీణ్ పోషించిన ‘తత్కాల్’ పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుందని’ అన్నారు. శివరాజ్ ఫిలింస్ పతాకంపై శివరాజ్ కనుమూరి స్వయంగా నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ నవంబర్ 17 విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీనివాస్‌రెడ్డి-పూర్ణ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రవీణ్, పోసాని, జీవా, రవివర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం చూసిన ప్రముఖ దర్శకులు సుకుమార్` తన బ్యానర్‌లో శివరాజ్ కనుమూరికి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడం.. ఈ చిత్రం హక్కులు ఎన్.కె.ఆర్ ఫిలింస్ అధినేత నీలం కృష్ణారెడ్డి సొంతం చేసుకోవడం.. వంటి అంశాలతో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ వారంలో విడుదల కానుంది!!