- Advertisement -
ఆసీస్-భారత్ మధ్య ఈనెల 17 నుండి తొలి టెస్టు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. రహానే భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండటంతో అతడిపై ఒత్తిడి ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీటిని ఖండించారు భారత మాజీ లెజెండ్ ఆటగాడు సునీల్ గవాస్కర్.
భారత జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం రహానెకు ఇంతకముందు ఉందని… ఒక వైస్ కెప్టెన్‌కు ఇది పెద్ద భారం కాదని అభిప్రాయపడ్డాడు గవాస్కర్. రహానే గతంలో రెండు మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు. అందులో ఒకటి ఒకటి ఆస్ట్రేలియా కు వ్యతిరేకంగానే… అయితే ఈ రెండు మ్యాచ్ లలో భారత్ విజయం సాధించిందని తెలిపాడు గవాస్కర్.
- Advertisement -