చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో భారత్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో భారత లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రెండో టెస్టులో లెగ్‌స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని కోరాడు. అశ్విన్, సుందర్‌లు ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లే.. అయితే బౌలింగ్‌లో ఎవరి శైలి వారిది. అయితే ఇప్పటికిప్పుడు సుందర్‌ను తీసేయాలనేది కరెక్ట్ కాదన్నారు. ఫిబ్రవరి 13 నుంచి మొదలుకానున్న రెండో టెస్టులో షాబాజ్ నదీమ్‌ను తప్పించి కుల్దీప్‌కు చాన్స్ ఇవ్వాలని కోరాడు.
తొలి టెస్టులో నదీమ్ కొంచెం ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించిందని తెలిపిన గవాస్కర్… అతను బౌలింగ్ చేసే విధానం, నో బాల్స్ వేసే తీరు చూస్తే అతను కాస్త ఇబ్బందికి గురైనట్లు కనిపించిందన్నారు. కుల్దీప్ టీమిండియా తరపున 6 టెస్టుల్లో 24 వికెట్లు, 61 వన్డేల్లో 105 వికెట్లు, 21 టీ20ల్లో 39 వికెట్లు తీశాడు.