సన్ ఫ్లవర్ విత్తనాలతో ఎన్ని ప్రయోజనాలో?

67
- Advertisement -

సన్ ఫ్లవర్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దీనిని తెలుగులో పొద్దు తిరుగుడుపువ్వు అంటారు దీనిలో ఉండే విత్తనాలతో వంటనూనె తయారుచేస్తారు. మన దేశంలో విరివిగా ఉపయోగించే వంటనూనెలలో సన్ ఫ్లవర్ ఆయిల్ ముందు వరుసలో ఉంటుంది. ఈ ఆయిల్ చాలా తేలికగా ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొందరికి సన్ ఫ్లవర్ విత్తనాలను నేరుగా తినే అలవాటు ఉంటుంది. బయట రోడ్లపై వీటిని ప్యాకెట్లలో పోసి అమ్ముతూ ఉంటారు. టైంపాస్ గా వీటిని తింటూ ఉంటారు. అయితే ఈ పొద్దతిరుగుడు పువ్వు విత్తనాలు తినడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా అంటే పుష్కలమైన లాభాలు ఉన్నాయని చెబుతున్నారు ఆహార నిపుణులు..

పొద్దుతిరుగుడు విత్తనాలలో విత్తనాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జీర్ణ శక్తి పెంచి మలబద్దకాన్ని తగ్గిస్తాయి. ఇంకా ఇందులో ఉండే ఏమైనో యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేసి రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి. ఇంకా ఈ సన్ ఫ్లవర్ సిడ్స్ లో విటమిన్ ఇ, సెలీనియం, కాపర్ వంటి వంటివి శరీరంలోని చెడు వ్యర్థాలను బయటకు పంపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా ఇందులో పోషకాలు కొలన్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వాటిని దూరం చేయడంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఇందులో విటమిన్ సి కూడా తగిన మోతాదులో లభిస్తుందట. తద్వారా శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకా గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు ఉపయోగ పడతాయని అందువల్ల వీటిని తినడం వల్ల లాభలే ఎక్కువ నిపుణులు చెబుతున్నా మాట.

Also Read:ఏపీ మంత్రులు…వారి శాఖలివే

- Advertisement -