రజనీ సినిమా నుండి సుందర్‌ ఔట్!

4
- Advertisement -

రజనీకాంత్ 173వ సినిమాను (#Thalaivar173) తాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు కమల్ హాసన్, . ఈ చిత్రానికి సుందర్ C‌ను దర్శకుడిగా తీసుకున్నారు. అయితే అధికారిక ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే, సుందర్ C ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు.

ఈ పరిణామం చాలామందికి షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి ఎన్నో రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. కొందరు చెప్పినదాంతో — సరైన కథ లేకపోవడం వల్ల సుందర్ C వెనక్కి తగ్గారని, ఈ విషయంపై రజిని, కమల్‌లకు కూడా చెప్పకుండా నేరుగా విషయాన్ని బయటపెట్టారని ప్రచారం జరిగింది.

Also Read:పీఎం కిసాన్‌..డేట్ ఫిక్స్!

సుందర్ C భార్య, నటి ఖుష్బూ సుందర్ అయితే ఈ రూమర్లన్నింటినీ ఖండించారు. అయితే సుందర్ C తప్పుకోవడానికి కారణం ఏమిటో కమల్ లేదా రజిని చెప్పే రోజు వస్తుందా? చూడాలి.

- Advertisement -