సూపర్ స్టార్ రజనీకాంత్ – లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో మల్టీస్టారర్ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహిస్తారని మేకర్స్ వెల్లడించారు.
అలాగే 2027 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్ భాగమే కానీ రజనీతో స్క్రీన్ షేర్ చేసుకోరు. సినిమాను మాత్రం నిర్మించనున్నారు కమల్.
అరుణాచలం తర్వాత 27 ఏళ్లకు రజనీ- సుందర్ సి కాంబో మళ్లీ కలుస్తోంది. నా స్నేహితుడి సినిమాను నేను నిర్మించి మీ అందరికి పండుగ బహుమతిగా ఇవ్వనున్నాను అంటూ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు కమల్. ‘రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ పతాకంపై కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘తలైవర్ 173’తో రజనీ మళ్లీ పండగ సీజన్‌లో దుమ్ము లేపనున్నాడు.
Also Read:భారత మహిళ జట్టుకు ప్రధాని ప్రశంసలు

