ఉదయ్ కిరణ్ బయోపిక్ పై స్పందించిన సందీప్ కిషన్

454
Uday Kiran Sundeep kishan
- Advertisement -

దివంగత టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ జీవిత చరిత్రపై బయోపిక్ తెరకెక్కనుందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉదయ్ కిరణ్ బయోపిక్ లో యువ హీరో సందీప్ కిషన్ ముఖ్య పాత్రలో నటించనున్నాడని ప్రచారం జరుగుతుంది. ఓ షార్ట్ ఫిలిం దర్శకుడు సందీప్ కిష‌న్‌తో ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ చేయాల‌ని భావించ‌గా, ఆయ‌న రీసెంట్‌గా సందీప్‌ని క‌లిసి స్టోరీ వినిపించాడ‌ని..దీనికి ఇంప్రెస్ అయిన సందీప్‌..బ‌యోపిక్ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

ఈ విషయంపై తాజాగా స్పందించాడు సందీప్ కిషన్. తనకు బయోపిక్స్‌పై ఇంట్రస్ట్ లేదని తేల్చి చెప్పాడు. ఉదయ్ కిరణ్ బయోపిక్‌కి సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదని..మీడియాలో వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని పేర్కొన్నాడు. కాగా ఉదయ్ కిరణ్ చివరి రోజుల్లో నటించిన చిత్రం చెప్పిన కథ మూవీ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఈమూవీని విడుదల చేస్తారని వార్తలు వస్తున్నా విడుదల చేయాడానికి ఎవరు ముందుకు రావడం లేదని తెలుస్తుంది.

- Advertisement -