ఉద్యోగులకు షాకిచ్చిన సుందర్ పిచాయ్!

125
- Advertisement -

ఆర్థికమాంద్యం నేపథ్యంలో టెక్ దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ నుంచి వేలాది మంది ఉద్యోగులను తొలగించగా తాజాగా గూగుల్ కూడా ఉద్యోగాల్లో కోత విధించేందుకు సిద్ధమైంది. గూగుల్‌లో పనిచేసే చాలా మంది ఉద్యోగుల పనితీరుపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

గూగుల్‌లో ఉత్పాదకత తగ్గిపోయిందని, కంపెనీలో చేయాల్సి పనికన్నా ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని పిచాయ్ అభిప్రాయపడ్డారు. పనికి మించిన ఉద్యోగులను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదని తెలిపారు.అలాగే ఉద్యోగులు సమర్థవంతంగా పని చేయాలని, వారి ఉత్పత్తులను మెరుగుపర్చేందుకు కస్టమర్‌లకు ఎలా సహాయపడాలనే దానిపై మరింత దృష్టిసారించాలన్నారు.

- Advertisement -