భారతదేశంలో శరవేగంగా జరుగుతున్న మార్పులు తనను ఆశ్చర్యపరుస్తోందని పేర్కొన్నారు సుందర్ పిచాయ్. న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నిర్వహించిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు.
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకు చెందిన పిచాయ్ తన కాలేజీ రోజుల్ని గుర్తుచేసుకున్నారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చెన్నై నుంచి ఐఐటీ ఖరగ్‌పూర్ వరకు కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేవాడిని. ఆ సమయంలో విశాఖపట్నం ఒక ప్రశాంతమైన తీర నగరంగా ఉండేది. ఇప్పుడు అదే నగరంలో గూగుల్ పూర్తి స్థాయి AI హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇది భారతదేశంలో మా 15 బిలియన్ డాలర్ల మౌలిక వసతుల పెట్టుబడిలో భాగం అని తెలిపారు.
ఆ రైల్లో కూర్చొని ఉన్నప్పుడు విశాఖపట్నం గ్లోబల్ AI హబ్ అవుతుందని ఊహించలేదన్నారు. అలాగే, తాను ఒక రోజు డేటా సెంటర్లను అంతరిక్షంలో ఏర్పాటు చేయడం లేదా తన తల్లిదండ్రులను సాన్ ఫ్రాన్సిస్కోలో పూర్తిగా ఆటోనమస్ కారులో ప్రయాణింపజేయడం గురించి ఆలోచించలేదని చెప్పారు.
తన తండ్రి రెగునాథ పిచాయ్..డ్రైవర్ లేని కార్లు భారత రోడ్లపై నడిస్తేనే ఎక్కువగా ఇంప్రెస్ అవుతాను అని చెప్పారని గుర్తుచేసుకుంటూ..ఇంకా దానిపై పని చేస్తున్నాను, డాడ్” అని సరదాగా అన్నారు. AI ఉద్యోగ రంగాన్ని మార్చేస్తుందని, కొన్ని పనులను ఆటోమేట్ చేస్తూ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం AI ఆధారిత వాతావరణ అంచనాలను కోట్లాది రైతులకు అందించడం ప్రశంసనీయం అని తెలిపారు.
Also Read:TG:26 నుంచి అసెంబ్లీ సమావేశాలు

