మోదీతో సుందర్ పిచాయ్ భేటీ

4
- Advertisement -

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్( Sundar Pichai) బుధవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొనడానికి ఆయన భారత్‌కు వచ్చారు. ఫిబ్రవరి 20న జరిగే సమ్మిట్‌లో పిచాయ్ ప్రధాన ప్రసంగం ఇవ్వనున్నారు.

భారత్ చేరుకున్న అనంతరం పిచాయ్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ, “ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం మళ్లీ భారత్ రావడం ఆనందంగా ఉంది. ఎప్పటిలాగే ఆత్మీయ స్వాగతం లభించింది అని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో 110కి పైగా దేశాలు, 30 అంతర్జాతీయ సంస్థలు, పలువురు దేశాధినేతలు, మంత్రులు పాల్గొంటున్నారు. గ్లోబల్ సౌత్‌లో నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ ఇదే.

ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ, భారత్ ఐటీ రంగం 2030 నాటికి 400 బిలియన్ డాలర్లకు చేరే అవకాశముందని తెలిపారు. ఈ సమ్మిట్ ‘People, Planet, Progress’ అనే మూడు సూత్రాలపై ఆధారపడి, మానవ కేంద్రిత, పర్యావరణ అనుకూల, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

Also Read:డీసెంట్ కలెక్షన్స్‌తో ‘నిలవే’!

- Advertisement -