రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైనట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రదేశాల్లో చిత్రీకరించారు. అయితే ఈ చిత్రం సెట్స్‌లో జాయిన్ అవడానికి రెండు రోజుల క్రితమే వెళ్లిన హీరోయిన్ సమంత ఎండ తాకిడికి వడదెబ్బకి గురయిందట.
దీంతో మరో మూడు రోజులు జరగాల్సిన షెడ్యూల్‌ని ఆపేసి చిత్ర బృందం హైదరాబాద్‌కి తిరిగి వచ్చేస్తున్నారు. మే రెండవ వారం నుంచి తదుపరి షెడ్యూల్ మొదలవుతుంది. ఎండల తాకిడి తీవ్రంగా వుండడంతో, అది కూడా కోస్తా జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో షూటింగ్ చేసేందుకు అనువైన వాతావరణం లేదు. అయినప్పటికీ ఆ ఎండల్లోనే మూడు వారాల పాటు షూటింగ్ చేసారు.
హీరోయిన్‌తో సీన్లు షెడ్యూల్ చివర ప్లాన్ చేయగా, సమంత మొన్ననే అక్కడికి వెళ్లింది. ఆ ఎండలు అలవాటు లేకపోవడంతో సమంత నిన్న పూర్తిగా షూటింగ్ చేయలేకపోయింది. ఆమె సొమ్మసిల్లి పడిపోవడంతో నిన్న షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి ఈరోజు చేద్దామనుకున్నారు. అయితే ఆమె ఇంకా కోలుకోకపోవడంతో షెడ్యూల్‌కి ప్యాకప్ చెప్పేసారు. మొత్తానికి సమంత ఇలా ఎండదెబ్బకి గురవడం వల్ల షూటింగ్ క్యాన్సిల్ అయింది. మరి మే నెలలో ఎండలు ఇంకాస్త తీవ్రంగా వుంటాయి. ఆ టైంలో ఏ ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేస్తారో చూడాలి మరి.
సొమ్మసిల్లిన సమంత..
- Advertisement -
- Advertisement -