సన్ రైజర్స్ హైదరబాద్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన నిన్నటి మ్యాచ్ లో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో రెండు పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో 182 పరుగులు చేసింది. ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ (21), అభిషేక్ శర్మ (16) భారీ ఇన్నింగ్స్ అడే ప్రయత్నంలో అక్షదీప్ సింగ్ బౌలింగ్ లో అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన మార్క్రమ్ కూడా డకౌట్ గా వెనుదిరగడంతో 5 ఓవర్లలోనే సన్ రైజర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆ తర్వాత జట్టులోకి వచ్చిన తెలుగు తేజం నితిశ్ కుమార్ రెడ్డి 64 (37 బంతుల్లో) అద్బుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. నితిశ్ రెడ్డికి తోడు సమద్ (25), అమిద్ (14) పరుగులు చేయడంతో సన్ రైజర్స్ 182 పరుగులు చేసింది. ఇక లక్ష్య చేధనలో పంజాబ్ కూడా చివరి వరకు పోరాడింది. శిఖర్ ధావన్ (14), శశాంక్ సింగ్ (46), సామ్ కరణ్ (29), సికందర్ (28), అశుతోష్ శర్మ(33) పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో పంజాబ్ ను ఓటమి పలకరించింది.
నితిశ్ సూపర్ ఇన్నింగ్స్
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ చేరుతున్న వేళ తెలుగు తేజం నితిశ్ కుమార్ రెడ్డి 64 (37 బంతుల్లో) అద్బుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లో కూడా కీలక వికెట్ తీసి పంజాబ్ విజయనికి బ్రేకులు వేశాడు. నితిశ్ ఇన్నింగ్స్ కు తోడు భువనేశ్వర్ కుమార్ (2/32) బౌలింగ్ లో అదరగొట్టడంతో సన్ రైజర్స్ అద్బుత విజయం సాధించింది.
నేటి మ్యాచ్ లు
నేడు జరిగే ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో టాప్ ప్లేస్ లో ఉండగా, గుజరాత్ టైటాన్స్ జట్టు గత మ్యాచ్ లో గెలిచిన జోష్ లో ఉంది. దాంతో ఈ రెండు జట్ల మధ్య జరగనున్న పోరు ఆసక్తికరంగా సాగనుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది.
Also Read:అభిషేక్ నామా… ‘నాగబంధం’