వేసవిలో వ్యాయామం.. జాగ్రత్త!

26
- Advertisement -

భగ భగ మండే వేసవి కాలం రానే వచ్చింది. ఉదయం 8 గంటలు కూడా గడవక ముందే ఎండ తీవ్రత విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడడం ఖాయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ప్రతిరోజూ వ్యాయామం చేసే అలవాటు ఉన్నవారు ఈ వేసవిలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే అనారోగ్యానికి లోనవడం ఖాయం. వ్యాయామంలో భాగంగా ఉదయం పూట చాలమంది రన్నింగ్ చేస్తుంటారు. కాబట్టి రన్నింగ్ కు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ వెంటబెట్టుకొని వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఈ వేసవిలో ఉక్కబోత తీవ్రంగా వేధిస్తుంది. కొద్ది దూరం పరిగెత్తగానే అలసట, ఆయాసం రావడంతో పాటు అధిక చెమట కారణంగా శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది.

అందువల్ల వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళడం మంచిదని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. ఎండలు మండిపోతుండడం వల్ల ఎండలో ఏ మాత్రం వ్యాయామం చేయకూడదు. వేడి తీవ్రత కారణంగా మైకం కమ్మి స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీడ ప్రాంగణంలోనే వ్యాయామం చేయాలి. ఇంకా అతిగా వ్యాయామం చేయకూడదు. ఎందుకంటే ఎండ తీవ్రత కారణంగా త్వరగా అలసిపోయి వడదెబ్బకు దారి తీస్తుంది. వడదెబ్బ బారిన పడితే మూర్ఛ పోవడం, గందరగోళానికి లోనవ్వడం, వాంతులు, అజీర్తి, తలనొప్పి.. ఇలా చాలా సమస్యలే చుట్టుముడతాయి. కాబట్టి ఈ వేసవి కాలంలో వ్యాయామం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

* ఉదయం 7 గంటల లోపే వ్యాయామాన్ని ముగించాలి.
* వ్యాయామంలో చేసేటప్పుడు ఎనర్జీ డ్రింక్స్ సేవించాలి.
* అతిగా వ్యాయామం చేయకుండా తగు స్థాయిలోనే చేయాలి.
* ఉక్కబోత కలిగే ప్రదేశాల్లో వ్యాయామం చేయకుండా.. గాలి తాగే ప్రదేశాల్లోనే వ్యాయామం చేయాలి.

Also Read:వీటితో కొలెస్ట్రాల్‌ కు చెక్ పెట్టండి…

- Advertisement -