“సుబ్రహ్మణ్యపురం” టీజర్‌ విడుదల

234

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్ తన 25వ చిత్రం “సుబ్రహ్మణ్యపురం” అనే మూవీ చేస్తున్నాడు. ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తుండగా శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. వాస్తవిక మేళవింపులతో మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో ఈషా రెబ్బ హీరోయిన్‌గా నటిస్తోంది. తనికెళ్ల భరణి, సాయికుమార్, అలీ, మాధవి, సురేష్ తదితరులు వివిధ పాత్రల్లో అలరించనున్నారు.

దెయ్యానికి ఆగ్రహమొస్తే దేవుడ్ని ఆశ్రయించవచ్చు. మరి దేవుడికే ఆగ్రహమొస్తే మానవుడి పరిస్థితి ఏంటి? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈమేరకు చిత్ర టీజర్‌ను మూవీ యూనిట్ విడుదల చేసింది. నాస్తికుడిగా, దేవాలయాల మీద పరిశోధన చేసే పాత్రలో సుమంత్ నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు చేయని సరికొత్త కాన్సెప్ట్‌తో సుమంత్ అభిమానుల ముందుకువస్తున్నాడు. ఇక ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి మరి.

నువ్ దేవుడ్ని ఎదురిస్తున్నావ్ అంటే.. ‘ఎదురిస్తే ఏం చేస్తాడండీ మీ దేవుడు’, ఆ భగవంతుడు ‘సుబ్రహ్మణ్యపురం’ ఊరికి రక్షణగా ఒకడ్ని సిద్ధం చేసే ఉంచాడు.. అతడే కార్తీక్ లాంటి సంభాషణలు ఆసక్తిరేకెత్తిస్తున్నాయి. మళ్ళీ రావా’ వంటి వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న సుమంత్, తాజాగా “సుబ్రహ్మణ్యపురం”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Subrahmanyapuram Official Teaser 4K || Sumanth , Eesha Rebba || Santhossh Jagarlapudi