బాలయ్య..ఓ డిక్షనరి:సుమంత్

244
ntr biopic
- Advertisement -

నందమూరి బాలకృష్ణ ఓ డిక్షనరి అన్నారు హీరో సుమంత్ తెలిపారు. సుమంత్ నటించిన సుబ్రమణ్యపురం డిసెంబర్ 7న తర్వాత ఇదం జగత్ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చరిత్ర గురించి బాలయ్యకు అన్ని విషయాలు తెలుసని..ఎన్టీఆర్, ఏఎన్నార్ గారి డైలాగులు, వారి సినిమాల గురించి మొత్తం చెప్పేవారని తెలిపారు.

‘ఎన్టీఆర్’ బయోపిక్ అనగానే కళ్లు మూసుకుని ఒప్పుకున్నానని తెలిపారు. డైరెక్టర్ క్రిష్ అంటే తనకు చాలా ఇష్టమని…ఈ సినిమాలో తాతగారి పాత్రను పోషించడం ఒక గౌరవమని చెప్పారు. సినిమా తప్పకుండా భారీ హిట్ సాధిస్తుందన్నారు.

సుమంత్ నటించిన ఇదం జగత్ డిసెంబర్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తుండగా…. సుమంత్ కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -