ఒకప్పుడు నటన, ఫైట్లు,డ్యాన్సులతో దుమ్మురేపిన స్టార్ హరో సుమన్. చిరంజీవికి ఈక్వల్ గా స్టార్ డమ్ తెచ్చుకున్న కొన్ని పరిస్థితులు ఆయన్ని అధఃపతాలానికి తొక్కేశాయి. అయినా.. మళ్లీ సినిమాలు చేశాడు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తరువాత సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మిగిలిపోయారు. అప్పట్లో సుమన్ ను కావాలనే ఓ అగ్ర హీరో తొక్కేశాడనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
కెరియర్ పరంగా చూస్తే.. సౌత్ లోని అన్నిభాషల్లో కలిపి సుమన్ 500 పైగా సినిమాలు చేశారు. ఇందులో తెలుగులోనే 99 సినిమాలున్నాయి. అంటే మరో సినిమా చేస్తే.. ఇప్పుడున్న అగ్రహీరోలు చిరంజీవి, బాలయ్య తరువాత ఆ ఘనత సాధించిన ఘనత సుమన్ సాధిస్తాడు. సుమన్ 100 సినిమా ఎప్పుడో చేసేవారు. అయితే మైలురాయి చిత్రం.. తన కెరియర్ లో నిలిచిపోయేలా ఉండాలని సుమన్ భావిస్తున్నాడు.
అందుకే ఇంతలేట్ అవుతుందని సమాచారం. బాలయ్య లాగే సుమన్ కూడా సెంచరీ సినిమాను సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారట. అందుకే మంచి కథతో వచ్చే దర్శకుల కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. మరీ, సుమన్ 100 వ చిత్రం కోసం ఎలాంటి కథను ఎంచుకుంటారు. అది ఎలాంటి సంచలనాలకు వేదికవుతుందో చూడాలి.