సుమ గుండు బాయ్‌ ఎవరో తెలుసా..!

348
suma rajeev
- Advertisement -

యాంకర్‌ సుమ… ఈ పేరు తెలియని వారుండరు. ఏ హీరో ఫ్యాన్స్‌ అయినా ఆవిడ ఫ్యాన్సే. ఏ ఇంట్లో అయినా ఆవిడ ప్రస్తావనే.. తెలుగు మాతృభాష కాకపోయినా 56 అక్షరాల తెలుగు పిల్ల ఆవిడ. హ్యూమర్‌ ఆవిడ స్పెషాలిటి.. గ్లామర్‌ ఆవిడ క్వాలిటీ.. ఆవిడ ఓ స్టార్‌ మహిళ .. వాఖ్యానాన్ని ఆవిడ సున్నితమైన హాస్యంతో సరదా సరదాగా మార్చేసిన యాంకర్‌ ఆవిడ. ఆమె ఏ షో చేసినా ప్రేక్షకులు అవాక్కవ్వాల్సిందే.. పక్కనున్నది స్టార్‌ అయినా సూపర్‌ స్టార్‌ అయినా అదే తీరు.. అదే జోరు.. అందుకే ఏ సినిమా ఫంక్షనైనా ఆవిడే యాంకర్‌.

1991లో టీవీ పరిశ్రమలో అడుగుబెట్టిన ఈ స్టార్‌ యాంకర్‌ తన ఈ 26 ఏళ్ల ప్రస్థానంలో 26 ఇంగ్లీష్‌ అక్షరాలకు అందనంత ఎత్తుకు ఎదిగారు. టీవీ నటిగా ప్రయాణం మొదలు పెట్టి.. రాజీవ్‌ చేయిపట్టి.. మెట్టినింటా అడుగుపెట్టి.. పట్టుబట్టి వ్యాఖ్యానం లక్ష్యం వైపు గురిపెట్టి తెలుగువారికి అయింది బంగారు పెట్టి ఈ గారాల పట్టి. యాంకరింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకుంది.

తాజాగా సుమ త‌న ట్విట్ట‌ర్‌లో భ‌ర్తతో క‌లిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. మై గుండు బాయ్ అంటూ కామెంట్ పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్ళి తర్వాత తొలిసారిగా గుండు చేయించుకున్నాడు రాజీవ్. సుమ షేర్ చేసిన ఫోటోకి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పెళ్లయి దాదాపు 20 సంవత్సరాలు కావస్తోన్న వీరు ఇప్ప‌టికి ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఇత‌రుల‌కి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

- Advertisement -