‘టెనెంట్’ రిలీజ్ ట్రైలర్ చాలా నచ్చింది..

20
- Advertisement -

‘పొలిమేర2’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ ‘టెనెంట్’. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఏప్రిల్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో ప్రియదర్శి ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

సత్యం రాజేష్ ప్రేమకథ, పెళ్లి సన్నివేశాలతో ఫీల్ గుడ్ గా మొదలైన ట్రైలర్ తర్వాత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం కట్టిపడేసింది. ట్రైలర్ లో చూపించిన కంటెంట్ చాలా ఎక్సయిటింగ్ గా వుంది. పోలీస్ అధికారి ఎస్తర్ ”నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని నువ్వే చంపేయడం ఏమిటి? అని ప్రశించగా.. ‘రావణాసురుడు సీతని చెరబడితే శిక్ష సీతకెందుపడింది?’ అని సత్యం రాజేష్ ఎదురు ప్రశ్నించడం కథ పై మరింత క్యురియాసిటీని పెంచింది. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు సత్యం రాజేష్. ట్రైలర్ లో కనిపించిన మిగతా నటులు కూడా తమ పాత్రలలో ఒదిగిపోయారు. దర్శకుడు వై. యుగంధర్ ఎంచుకున్న పాయిటింగ్ చాలా ఎమోషనల్, థ్రిల్లింగ్ గా వుంది. నేపధ్య సంగీతం థ్రిల్ మని మరింత ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. మొత్తానికి రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది.

రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. రాజేష్ అన్నకి ముందుగా హ్యాపీ బర్త్ డే. రాజేష్ అన్నకి నేను పెద్ద ఫ్యాన్ ని. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అద్దె కట్టకుండా టెనెంట్ గా ఉంటున్నాడు రాజేష్ అన్న(నవ్వుతూ). నటుడిగా ఆయన ప్రయాణం, ట్రాన్స్ ఫర్మేషన్ స్ఫూర్తిదాయకం. ముందు రిలీజ్ చేసిన ట్రైలర్ తో పాటు ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ బాగా నచ్చింది. నిర్మాతలు చంద్రశేఖర్ రెడ్డి, రవీందర్ రెడ్డి గారికి, దర్శకుడు యుగంధర్ గారి టీం అందరికీ ఆల్ ది బెస్ట్. నిర్మాతల కళ్ళలో ఆనందం చూస్తుంటే సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో అర్ధమౌతోంది. సినిమా ఆల్రెడీ హిట్. ఎక్కువ మంది ప్రేక్షకులకు టెనెంట్ సినిమా రీచ్ అవుతుందని నమ్ముతున్నాను. కంటెంట్ చాలా కొత్తగా వుంది. ఏప్రిల్ 19న సినిమా వస్తోంది. తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూడండి’ అని కోరారు.

హీరో సత్యం రాజేష్ మాట్లాడుతూ… దర్శకుడు యుగంధర్ గారు ‘టెనెంట్’ కథని ఎంత అద్భుతంగా చెప్పారో అంతే అద్భుతంగా సినిమాని తీశారు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు క్లైమాక్స్ లో కన్నీళ్లు వచ్చేశాయి. అంత అద్భుతంగా వచ్చింది సినిమా. నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి గారు మంచి చదువరి. ఆయన ఆలోచనలో ఉన్నతంగా నెక్స్ట్ జనరేషన్ గా వుంటాయి. ఈ సినిమాని చాలా ప్రేమించి చేశారు. తప్పకుండా ఇది ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. చందన అద్భుతంగా నటించారు. ఎస్తెర్ గారి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి మరో ఆకర్షణ. భరత్ చందు అనురాగ్ పోటాపోటీగా నటించారు. సాగర్ గారు చాలా చక్కని సంగీతం అందించారు. ఏప్రిల్ 19న సినిమా విడుదలౌతుంది. ప్రతీ ఒక్కరూ తప్పకుండా సినిమాని ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

Also Read:ఉదయాన్నే తలనొప్పి వస్తే..ఇలా చేయండి!

- Advertisement -