ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలి : పద్మ

83
padma
- Advertisement -

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా అందరూ పాల్గోని విరివిగా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షిస్తున్నారు. తాజాగా మారేడ్‌పల్లి తహాసీల్దార్‌ మాధవిరెడ్డి విసిరిన ఛాలెంజ్‌ స్వీకరించిన సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటిన ఎస్సై పద్మ.

ఈ సందర్భంగా సిఐ పద్మ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాబోయే తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామిని చేసినందుకు ఎంపీ సంతోష్‌ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మలక్‌పేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జ్యోత్స్న, కోటి వుమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ విజులత, గవర్నమెంట్ మెటర్నటి హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి కి సవాలు విసిరారు.

- Advertisement -